Ready
Cast :  Ram, Genelia, Kota Srinivasa Rao, Nazar
Director :  Sreenu Vaitla
Music Director :  Devisri Prasad
Producer :  Sravanthi, Ravi Kishore
Banner :  Sri Sravanthi Movies
 | Review  | Trailers  | Videos  | Audio  |  Wallpapers  | Photogallery  | Muhurtham- Photogallery  | Working Stills- Photogallery  | Audio Launch- Photogallery |
రామ్ 'రెడీ.. దేనికైనా' అంటున్నాడు. ఒక హిట్టు (దేవదాసు), ఒక ఫ్లాపు (జగడం) తర్వాత అతను నటించిన మూడవ సినిమా 'రెడీ'. 'దేనికైనా' అనేది ట్యాగ్ లైన్. 'ఢీ', 'దుబాయ్ శీను'ల తర్వాత హాట్ డైరెక్టర్‌గా మారిన శ్రీను వైట్ల ఈ సినిమాను రూపొందించాడు. ఇదివరకు పలు హిట్ సినిమాల్ని అందించిన స్రవంతీ మూవీస్ అధినేత డి. రవికిశోర్ ఈ సినిమా నిర్మాత. రామ్ సరసన చిరునవ్వుల తార జెనీలియా నటించింది.
'రెడీ'లో రామ్ బళ్లారికి చెందిన ఇంజనీరింగ్ విధ్యార్థిగా నటించాడు. కథ ప్రకారం అతనిది ఉమ్మడి కుటుంబం. ఒకసారి అతను పనిమీద హైదరాబాదుకు వస్తాడు. అక్కడ జెనీలియా పరిచయమవుతుంది. ఆమె అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై అమ్మాయి. అన్ని సినిమాల్లో మాదిరిగానే ఆ ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే ఆమెతో ప్రేమవల్ల చిక్కుల్లో పడతాడు రామ్. వాటిని అతను ఎలా ఎదుర్కొని తన ప్రేమను గెలిచాడనేది కథ. ప్రేమ, యాక్షన్ మిళితమైన ఈ ఫ్యామిలీ డ్రామా బళ్లారి, హైదరాబాద్, వైజాగ్, అరకు, చాలక్కుడి (కేరళ) నేపథ్యాల్లో నడుస్తుంది.
ప్రస్తుతం ప్రేక్షకుల నాడి బాగా తెలిసిన శ్రీను చిత్రాల్లో కామెడీ బాగా అలరించే సంగతి మనకు తెలుసు. 'ఢీ' హిట్ కావడంలో బ్రహ్మానందం చేసిన కామెడీ ప్రముఖ పాత్ర వహించింది. ఇప్పుడు 'రెడీ'లోనూ బ్రహ్మానందం అదే పనిని చేయనున్నాడు. సినిమా ద్వితీయార్ధాన్ని బ్రహ్మానందం పాత్రే మోయనున్నది. రామ్ తండ్రిగా తనికెళ్ల భరణి, ఒక కీలక పాత్రలో నాజర్ నటించిన ఈ సినిమాలో సునీల్, వేణుమాధవ్ కూడా నటించారు. 'జల్సా' సినిమా మ్యూజిక్‌తో ఒక సెన్సేషన్ సృష్టించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే మార్కెట్‌లో వున్న మ్యూజిక్ జనాదరణ పొందుతున్నదని ఆడియో డీలర్లు చెబుతున్నారు. 
కోన వెంకట్, గోపీ మోహన్ సంయుక్తంగా స్క్రిప్టును సమకూర్చిన ఈ సినిమాకు ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రాఫర్. 'రెడీ'కు సంబంధించిన మరో హైలైట్ యాక్షన్ సన్నివేశాలు. ఖరీదైన ఫైట్ మాస్టర్‌గా పేరుపొందిన పీటర్ హెయిన్స్ ఇందులోని యాక్షన్ సన్నివేశాల్ని రూపొందించాడు. ఆ యాక్షన్ సన్నివేశాల్ని రామ్ విజృంభించి చేశాడని దర్శకుడు శ్రీను తెలిపాడు. మే 12న విడుదల కానున్న ఈ సినిమా తనను స్టార్‌ని చేస్తుందని రామ్ ఆశిస్తున్నాడు.
 

Give your Rating Here :
Average Rating: 3.33    Votes: 79

 
Featured Recommended
 
 
Movies Actress Actor Events