
Victory

| Cast : Nitin, Mamatha Mohandas |
| Director : Ravi C Kumar |
| Producer : Suresh Reddy |
| Banner : RR Movie Makers |
| Review
| Trailers
| Videos
| Audio
| Photogallery
| Muhurtham- Photogallery
| Working Stills- Photogallery
| Press Meet- Photogallery
| Audio Launch- Photogallery
|
|
ఇప్పుడు ఎక్కడ చూసినా రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా రాజ్యం చేస్తోంది. బలహీనుల భూముల్ని కొంతమంది దౌర్జన్యంగా ఆక్రమించుకుని దందాలు చేస్తున్నారు. భూ వ్యాపారం వేస్తున్నారు. ఫలితంగా భూమి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వారి దెబ్బకు సామాన్యులు విలవిల లాడుతున్నారు. దీనికి పరిష్కారమేమిటి? ఇప్పుడు ఈ అంశమే 'విక్టరి' సినిమా కథకు ఆధారం. నితిన్, మమతా మోహన్‌దాస్ జంటగా నటించిన ఈ సినిమాలో శశాంక్, సింధూ తులాని మరో జంట. రవి సి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్ఆర్ మూవీమేకర్స్ బానర్‌పై వెంకట్ నిర్మించారు. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో నితిన్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. దీని కోసం అతను మూడు నెలలు పైగా శ్రమించాడు. ట్రైనర్ సంపత్ ఆధ్వర్యంలో కండరాల్ని పెంపొందించుకొని, ఖచ్చితమైన డైట్ పాటించాడు. సినిమాలో ఒకసారికి మించి అతను చొక్కావిప్పి తన కండల్ని ప్రదర్శించాడు. ఆరంభ సన్నివేశంలో, ఒక పాటలో, ఒక ఫైటులో అతను చొక్కా లేకుండా కనిపిస్తాడు. 'విక్టరి' సినిమా ల్యాండ్ మాఫియా మీద తిరుగుబాటు చేసిన కుర్రాళ్ల కథ. సిటీలో భూమి ధరలు విపరీతంగా పెరగకుండా పరిష్కారాన్ని కూడా కనుగొనే ఉడుకు రక్తం వున్న యువకుల కథ. "ఇవాళ సొంత భూమి అనేది తీవ్రమైన సమస్య. ఈ కథకి ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారు" అని నితిన్ తెలిపాడు. వాస్తవానికి ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదాపడింది. మొదట మే 30న సినిమా విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించారు. ఆ తర్వాత జూన్ 6, జూన్ 14లకు వాయిదాపడి, ఎట్టకేలకు జూన్ 27న విడుదలకు సిద్ధమైంది. కొద్ది రోజుల క్రితం తమిళ హీరో విజయ్ ఈ సినిమాను ప్రత్యేకంగా తిలకించారనీ, తమిళంలో చేయడానికి హక్కులు తీసుకున్నారనీ వార్తలు వచ్చాయి. కాగా దర్శకుడు రవి సి కుమార్‌కు ఈ బానర్‌లో ఇది వరుసగా మూడవ సినిమా కావడం గమనార్హం. మొదట ఆయన 'ద ఎండ్' అనే సామాజిక ప్రయోజనాత్మక చిత్రం తీశారు. దానికి ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. ఆ తర్వాత ఆయన జగపతి హీరోగా రూపొందించిన 'సామాన్యుడు' బాగా ఆడింది. ఇప్పుడు 'విక్టరి' రూపొందించారు. బాలీవుడ్ నటుడు అశుతోష్ రాణా విలన్‌గా నటించిన ఈ సినిమాలో ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ల భరణి, కృష్ణభగవాన్, రఘుబాబు తదితరులు తారాగణం. చక్రి సంగీత దర్శకుడు కాగా, 'ఆనంద్', 'హ్యాపీడేస్' చిత్రాలకు పనిచేసిన విజయ్ సి కుమార్ సినిమాటోగ్రాఫర్. దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లేలను కూడా రవి స్వయంగా సమకూర్చారు. మునుపటి సినిమా 'ఆటాడిస్తా'తో పర్వాలేదనిపించుకున్న నితిన్ ఇప్పుడు ఎలాగైనా 'విక్టరి'ని సాధించాలనే గట్టి కంకణం కట్టుకున్నాడు. |
|
News | Box Office | Previews | Reviews | Trailers | Galleries | Wallpapers | Events | Videos | Audio Songs
©2006 - 2008 Chitramala.com. All rights reserved.



























